టుడే మిస్టరీ : ఆ హీరోయిన్ కి ప్లాప్ పడింది - ఆ హీరో పార్టీ ఇచ్చాడు ?

By Xappie Desk, December 26, 2018 21:43 IST

టుడే మిస్టరీ : ఆ హీరోయిన్ కి ప్లాప్ పడింది - ఆ హీరో పార్టీ ఇచ్చాడు ?

ఈ మధ్య కాలంలో ఆ కుర్ర హీరోకి బాగా పేరు వచ్చింది. మంచి సక్సెస్ లను సాధించాడు కూడా. అయితే ఈ మధ్య అతను చేసిన సినిమాలోని హీరోయిన్ తో విపరీతమైన మనస్పర్థలు తలెత్తాయి. ఆ విషయం పబ్లిక్ లోనే బట్టబయలు అయింది కూడా. ఇదే విషయమై ఆమె అనుచిత ప్రవర్తన మరియు వ్యవహార శైలి పై బహిరంగంగానే ఆ హీరో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇన్ని సన్నివేశాల మధ్య అందరూ ఊహించినట్లుగానే ఆ సినిమా ఫ్లాప్ అయింది.

అయితే సదరు హీరో తరువాతి చిత్రం పై దాని ప్రభావం ఉండదని, తరువాతి చిత్రంతో మళ్లీ తిరిగి ఫామ్ లోకి వస్తాడని ఆశించారు అంతా. దానికి అవసరమైన హైప్ కూడా ఇచ్చారు. కానీ అందరినీ షాక్ కి గురి చేస్తూ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీనితో అతను, అతని కుటుంబ సభ్యులు కొన్ని రోజులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు నుండి కోలుకొని అతను ప్రస్తుతం తన మిగతా ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టాడు.

కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ హీరో ఈ మధ్య భలే ఖుషీ గా ఎంజాయ్ చేశాడట. తనతో అప్పుడు విభేదించిన హీరోయిన్ తన తరువాత చిత్రం ఒక క్రేజీ ప్రాజెక్ట్ సాధించింది. ఆ డైరెక్టర్ – హీరో – హీరోయిన్ కాంబో చూసి అంతా చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే వాళ్ళ ఆశలపై నీళ్ళు చల్లుతూ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీనితో సదరు హీరో ఉబ్బితబబిబ్బైయ్యాడట. అతను తన శత్రువైన హీరోయిన్ ఫ్లాప్ ని ఎంజాయ్ చేస్తూ పార్టీ కూడా ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంక ఆ పార్టీ హాంగ్ ఓవర్ నుండి బయటకు వచ్చి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.


Forum Topics


Top