మళ్లీ బాలకృష్ణ ని టార్గెట్ చేసిన నాగబాబు..?

By Xappie Desk, December 28, 2018 12:02 IST

మళ్లీ బాలకృష్ణ ని టార్గెట్ చేసిన నాగబాబు..?

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల తెలంగాణ లో పర్యటించిన నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున పాల్గొన్న ప్రచారంలో “సారె జహాసే అచ్ఛా” పాట పాడలేక హే బుల్బుల్ అంటూ ప్రచారం చేయడంతో ఆ ప్రచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆ సమయంలో సోషల్ మీడియాలో బుల్ బుల్ బాలయ్య అంటూ తెగ ట్రోల్ చేసారు నెటిజన్లు. ఇదే క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు.. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటూ చేసిన కామెంట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారిన విషయం మనకందరికీ తెలిసినదే.

ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి ఇదే తరహాలో బాలకృష్ణ కి కౌంటర్ ఇచ్చారు నాగబాబు. ఇటీవల ఒక చిన్న పిల్ల వాడు “సారె జహాసే అచ్ఛా” దేశభక్తి గీతాన్ని తడబడకుండా పాడిన వీడియోను పేస్ బుక్ ల షేర్ చేసారు, ఈ వీడియో బాలకృష్ణకు కౌంటర్ గానే పోస్ట్ చేసారంటూ అంటున్నారు. నాగబాబు ఆ వీడియోను షేర్ చెయ్యటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఇప్పుడిప్పుడే మంచి వాతావరణం నెలకొని అనేకమంది మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న క్రమంలో ఇండస్ట్రీలో పెద్దగా ఉండే వారు ఇలా చేయడం వల్ల ఫ్యాన్స్ భావోద్వేగాలు రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టినట్లవుతుందని నాగబాబు పై విరుచుకు పడుతున్నారు నెటిజన్లు.


Forum Topics


Top