ఆ డైరెక్టర్ చేతిలో నుండి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ..?

By Xappie Desk, December 29, 2018 17:16 IST

ఆ డైరెక్టర్ చేతిలో నుండి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు తమ వారసులను ఇప్పటికే లాంచ్ చేసేసారు. ఈ నేపథ్యంలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తాజాగా ఒక వార్త ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చింది. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక వార్తలు వినపడయి.. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ నటించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో మెళకువలు మరియు గుర్రపు స్వారీ వంటి శిక్షణలో ఆరితేరుతున్నారట. మరోపక్క బాలకృష్ణ తన కొడుకు గురించి మంచి స్టోరీ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నట్లు.. ఇప్పటికే అనేక మంది డైరెక్టర్లు బాలకృష్ణ కి కథ చెప్పినట్లు ఇండస్ట్రీ నుండి వినబడుతున్న టాక్. ఈ క్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తున్న డైరెక్టర్ క్రిష్ తో బాలకృష్ణ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నందున అలాగే ఆయన పనితనం కూడా ఆయనకు నచ్చడంతో మోక్షజ్ఞను లాంచ్ చేసే అవకాశం క్రిష్ చేతిలో పెట్టడానికి నందమూరి బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీ లో నుండి వినబడుతున్న టాక్. మరి ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ కూడా కన్ఫర్మ్ కాలేదు.. కానీ కచ్చితంగా నందమూరి మోక్షజ్ఞ ను... క్రిష్ లాంచ్ చేయడం ఖాయమని అంటున్నారు ఇండస్ట్రీకి చెందినవారు.


Forum Topics


Top