కమెడియన్ కి సోషల్ మీడియా లో చుక్కలు చూపిస్తున్న పవన్ అభిమానులు..!

By Xappie Desk, December 31, 2018 17:10 IST

కమెడియన్ కి సోషల్ మీడియా లో చుక్కలు చూపిస్తున్న పవన్ అభిమానులు..!

తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలామంది స్నేహితులు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉండే వ్యక్తులలో కమెడియన్ ఆలీ ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బహిరంగ వేదికలలో కూడా పవన్ కళ్యాణ్.. ఆలీ తనకు దగ్గరగా ఉండే వ్యక్తి అని తనకు ఎంతో నచ్చుతాడని చాలా సందర్భాలలో తెలపడం జరిగింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలీ ని దారుణంగా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటున్న క్రమంలో ఆలీ కూడా త్వరలో రాజకీయాల్లోకి వస్తారని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు జనసేన పార్టీలో చేరటం ఖాయమని కూడా అనుకున్నారు.

అయితే తాజాగా ఇటీవల ఆలీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ను క‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. అది అనుకోకుండా జ‌రిగిందో , మ‌రి ఎలా జ‌రిగిందో తెలియ‌దు కాని జ‌గ‌న్‌తో అలీ క‌లిసి కూర్చున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి. దీంతో అలీ వైసీపీలో చేరతార‌నే వార్త‌లు ఊపుందుకున్నాయి. ఇలా అలీపై వార్త‌లు రావ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ అత‌నిపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. 'ప‌వ‌న్ ప‌క్క‌నే ఉంటూ.. ఇంత ప‌నిచేస్తావా' అన్న‌ట్టు అలీని ఆడిపోసుకుంటున్నారు. మరికొంత మంది అభిమానులు అలీని టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు.Top