రాజమౌళి కి ఎవరంటే పిచ్చి ? క్లియర్ గా చెప్పిన ప్రభాస్ !

By Xappie Desk, January 01, 2019 22:57 IST

రాజమౌళి కి ఎవరంటే పిచ్చి ? క్లియర్ గా చెప్పిన ప్రభాస్ !

అదేమిటి దర్శకధీరుడు రాజమౌళిని పిచ్చోడు అనడమే..? హమ్మా అలా అనే ధైర్యం ఏ హీరోకి ఉంది? అని ఆలోచిస్తున్నారా… ఆలా రాజమౌళిని పిచ్చోడు అన్నది ఎవరో కాదండి.. బాహుబలి ప్రభాస్. రాజమౌళి లాంటి సినిమా పిచ్చోళ్లే బాహుబలి లాంటి సినిమాకి ఐదేళ్లు కేటాయించగలరని… ఒకే ఒక్క సినిమా కోసం అలా ఐదేళ్లకు పాటు కేటాయించడం అనేది పిచ్చితనమే అవుతుందంటున్నాడు ప్రభాస్. బాహుబలికి ఐదేళ్లు శ్రమించినందుకు గానూ రాజమౌళి, ప్రభాస్ ఎలాంటి ఫలితం అందుకున్నారో తెలిసిందే. మరి ఒకే సినిమాకి అలా ఐదేళ్లు కేటాయిస్తే.. హీరోలకు ఇక మిగతా సినిమాలు చేసే టైం ఎక్కడుంటుందనున్నాడు ప్రభాస్.

ఇక సినిమాలంటే రాజమౌళికి ఉన్న పాషన్ పిచ్చితనం… అలాంటి పిచ్చి రాజమౌళిని…. సినిమా పిచ్చి ఉన్న మరికొందరు నమ్ముతారని అంటున్నాడు ప్రభాస్. హీరోలు ఒక్కో సినిమాకి నాలుగైదేళ్లు కేటాయిస్తూ పొతే అలా కెరీర్ లో నాలుగైదు సినిమాలకే ముసలోళ్లం అయిపోతామని… ఇలా ఐదేళ్లు ఒకే సినిమాకి కేటాయించడం పిచ్చితనం కాక మరేమవుతుంది అని అన్నాడు. అయితే ఆ ఐదేళ్లు శ్రమించినందుకు బాహుబలికి మంచి ఫలితం వచ్చిందని… అలా అన్ని సినిమాలకు వర్కౌట్ అవ్వదని ప్రభాస్ తేల్చేసాడు.

ఇక డైరెక్టర్స్ 80 నుండి 90 ఏళ్లు వచ్చినా సినిమాలు చేయగలరని.. హీరోలు హీరోయిన్స్ అలా కాదని… క్రేజ్ ఉన్నంత వరకే హీరోలుగా కొనసాగి తర్వాత ఇతర కేరెక్టర్స్ లోకి మారాలని.. అందుకే ఒకే సినిమాకి ఒక్కో హీరో ఇలా నాలుగైదేళ్లు కేటాయించడం కరెక్ట్ కాదనే భావనను ప్రభాస్ బయటపెట్టాడు. మరి తాజాగా ప్రభాస్ సాహో కోసం మూడేళ్లు పనిచెయ్యడం ఇబ్బందిగా అనిపించే జిల్ రాధాకృష్ణతో మరో సినిమాని మొదలెట్టేసాడు.


Forum Topics


Top