మహేష్ చేత స్టెప్పులు వేయించిన కూతురు సితార..!

By Xappie Desk, January 02, 2019 10:54 IST

మహేష్ చేత స్టెప్పులు వేయించిన కూతురు సితార..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మహేష్ సినిమా వస్తుందంటే సినిమా హాలు దగ్గర పడిగాపులు కాస్తుంటారు మహేష్ అభిమానులు. మహేష్ కి అంత క్రేజ్ ఉన్న ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇస్తుంటారు. సమయం దొరికితే చాలు తన కుటుంబాన్ని వెంట పెట్టుకుని విదేశాల్లో చక్కర్లు కొడుతుంటారు. అయితే తాజాగా ఇటీవల న్యూయర్ వేడుకలకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన మహేష్. అక్కడ ఫ్యామిలీతో క‌లిసి కొత్త సంవ‌త్స‌రాని స్వాగ‌తం ప‌లికాడు మ‌హేశ్. న్యూ ఇయ‌ర్ వేడుకల‌లో కూతురు సితార‌తో క‌లిసి డ్యాన్స్ వేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. సితార త‌న తండ్రి మ‌హేశ్ చేత రెండు డ్యాన్స్ స్టెప్‌లు వేయించింది. కూతురు అడిగితే ఏ తండ్రి కాదంటాడు చెప్పండి. కూతురు సితార అడ‌గడంతో డ్యాన్స్ వేశాడు మ‌హేశ్‌. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో మహేష్ కి తన ముద్దుల కూతురు సితార బలే షాక్ ఇచ్చింది అని అంటున్నారు నెటిజన్లు. మరి అదేవిధంగా తన కెరీర్లో 25వ సినిమా మహర్షి సినిమా కొత్త లుక్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు సినిమా యూనిట్.


Forum Topics


Top