షూటింగ్ అవ్వకుండానే డబ్బులు అడుగుతున్నా టాప్ హీరోయిన్..?

By Xappie Desk, January 03, 2019 18:18 IST

షూటింగ్ అవ్వకుండానే డబ్బులు అడుగుతున్నా టాప్ హీరోయిన్..?

సౌత్ ఇండియాలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ తండ్రి క్రేజ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటే పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగంలో ప్రముఖ ఇండస్ట్రీలలో చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. కెరియర్ మంచి హై పిచ్ లో ఉన్నప్పుడు శృతిహాసన్ సినిమాలు మానేసి ప్రేమలో పడి బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతుంది.

తాజాగా ఈ భామ‌కు త‌మిళంలో ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఛాన్స్ కూడా పోయ్యేలా క‌నిపిస్తుంది. సినిమా షూటింగ్ మొద‌లు కాకుండానే పారితోషికంలో సగం అడ్వాన్స్ గా ఇస్తేనే షూటింగుకు వస్తాననీ, లేదంటే రానని తేల్చి చెప్పినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. మరోవైపు చిత్రనిర్మాతలు షూటింగ్ మొదలు కాకుండానే డబ్బులు ఎలా ఇస్తాము అని అన్నారట. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో శృతిహాసన్ అభిమానులు ఘాటుగా స్పందించారు.. గ‌తంలో తన‌కు ఎదురైన అనుభ‌వాలు వ‌ల్లే శృతి హాస‌న్ డ‌బ్బులు ఇలా అడిగి ఉంటోంద‌ని అంటున్నారు.


Forum Topics


Top