మళ్లీ తలపట్టుకుంటున్న త్రివిక్రమ్

మళ్లీ తలపట్టుకుంటున్న త్రివిక్రమ్

తెలుగు చిత్రాల్లో పంచులా ప్రాసలా లా పరిచయంతో అందరి దృష్టి తనవైపు తిప్పుకొని సక్సెస్ను అందుకున్న రచయిత త్రివిక్రమ్. ఈయనను ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు, గురూజీ అని పిలుస్తుంటారు. ఈయన రైటర్ గానే కాక దర్శకుడుగానూ సక్సెస్ ని చూశారు. త్రివిక్రమ్ మీడియా కళ్లకు దూరంగా ఉంటాడు కానీ మీడియాలో వచ్చే కాపీ చిత్రాల కథనాలలో ఈయన కనబడుతూ ఉంటాడు.
 
త్రివిక్రమ్ ఈమధ్య చేసిన అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాలు కూడా కాపీలు అంటూ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ త్రివిక్రమ్ ఈ కాపీల వ్యవహారంపై ఎప్పుడు స్పందించలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చిత్రం చేయబోతున్నారు అది ఇంకా స్క్రిప్టు దశలోనే ఉండగా ఈ చిత్రం కూడా కాపీ అంటూ పలు రకాల రూమర్లు కథనాలు ప్రచారం అవుతున్నాయి.
 
ఇంకా స్క్రిప్టు దశలోనే ఉన్న ఈ చిత్రంపై ఇలా రూమర్లు కథనాలు రావడంపై త్రివిక్రమ్ తల పట్టుకుంటున్నారని తన సన్నిహిత వర్గాలు తెలిపారు. రచయితగా వచ్చి దర్శకుడిగా మారి తన ప్రతిభను చాటుకున్న త్రివిక్రమ్ తన చిత్రాలలో కొన్ని కాపీ సీన్ లు పెట్టడం వలన ఆడియన్స్ లో చులకన అవుతున్నారు అని సినీ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ మాటల మాంత్రికుడు సినీ ఇండస్ట్రీ కి కొత్తగా వస్తున్న ఎంతో మంది కొత్త రచయితలకు ఇన్స్పిరేషన్.Top