ఎన్టీఆర్ బయోపిక్ పై రూమర్స్ కొట్టిపారేసిన సినిమా యూనిట్..!

By Xappie Desk, January 08, 2019 12:52 IST

ఎన్టీఆర్ బయోపిక్ పై రూమర్స్ కొట్టిపారేసిన సినిమా యూనిట్..!

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా వెండితెరపై తెరకెక్కించారు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలో మొదటి భాగంలో ఎన్టీఆర్ సినిమా రంగానికి సంబంధించిన విశేషాలతో ఎన్టీఆర్ కథానాయకుడు అంటూ టైటిల్ పెట్టి ఈనెల 9వ తారీఖున విడుదల చేయడానికి రెడీ అయ్యారు బాలకృష్ణ. మరోపక్క రామారావుగారి రాజకీయ జీవితానికి సంబంధించి ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ జనవరి తొమ్మిదవ తారీఖున సినిమాలు విడుదల చేస్తున్నారు.
 
ఈ క్రమంలో సినిమా రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ మొత్తం డైరెక్షన్ బాలకృష్ణ చేసినట్లు కేవలం నామమాత్రంగా కృషి ఉన్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ముఖ్యంగా బాలకృష్ణ ఎన్టీఆర్ లాగా కనిపించే సీన్స్ అన్ని స్వయంగా ఆయనే డైరెక్ట్ చేసారని, వాటికి క్రిష్ కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేసారని కొన్ని మీడియా ఛానళ్లలో కధనాలు ప్రసారం అయ్యాయి. అయితే అందులో వాస్తవం లేదని సినిమా యూనిట్ కొట్టి పడేసింది. నిజానికి బాలకృష్ణ నటిస్తోంది తన తండ్రి పాత్రలోనే కాబట్టి, ఆ పాత్రకు, కధకు సంబందించిన కీలక సమాచారం ఏమైనా క్రిష్ తో చర్చించి ఉంటాడని, అంతే తప్ప బాలకృష్ణ దర్శకుడి పనిలో ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం ఉన్నవాడు కాదని అంటున్నారు. సంక్రాంతి సీజన్ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అటు సినిమా ఇండస్ట్రీలోనే ఇటు పొలిటికల్ రంగంలోనూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.


Forum Topics


Top