భారతీయుడు పార్ట్ 2 లో కమల్ హాసన్ తో పాటు కోలీవుడ్ కుర్ర హీరో..?

By Xappie Desk, November 15, 2018 12:34 IST

భారతీయుడు పార్ట్ 2 లో కమల్ హాసన్ తో పాటు కోలీవుడ్ కుర్ర హీరో..?

సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అప్పట్లో కమలహాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు సినిమా భారతీయ సినిమా రంగంలోని అనేక రికార్డులు మరియు కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇటీవల తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టిన కమలహాసన్ త్వరలో భారతీయుడు రెండవ భాగం సినిమా చేయడానికి రెడీ అవడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసినట్లు అయింది. ప్రస్తుతం శంకర్ రజనీకాంత్ హీరోగా రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ లో బిజీగా ఉన్నరు..ఈనెలాఖరులో విడుదల కాబోతున్న ఈ సినిమా అయిన వెంటనే భారతీయుడు రెండవ భాగం సినిమా చేయడానికి రెడీ అయినట్లు..ప్రస్తుతం సినిమాకి సంబంధించిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారతీయుడు రెండవ భాగంలో కమలహాసన్ తో పాటు కోలీవుడ్ కుర్ర హీరో శింబు కూడా నటిస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. మొన్నటిదాకా వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచిన శింబు ఈ మధ్య బుద్దిగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇగోలు పక్కన పెట్టి, ఇతర హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మణిరత్నం సినిమా "చెక్కి చివంత వానం" లో ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో శంకర్ అతనిని భారతీయుడు2 కోసం ఎంపిక చేసాడట. ఇందులో శింబు పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top