రోబో 2 క్రేజ్ ని ఈ ఒక్క న్యూస్ ఇంకా పెంచేస్తోంది !

రోబో 2 క్రేజ్ ని ఈ ఒక్క న్యూస్ ఇంకా పెంచేస్తోంది !

సౌత్ ఇండస్ట్రీ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన '2.ఓ' సినిమాపై రజనీకాంత్ అభిమానులకు భీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సాంకేతిక పరంగా హాలీవుడ్ స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని ఇండియన్ స్క్రీన్స్ పై గతంలో ఏ దర్శకుడు చూపించని విధంగా డైరెక్టర్ శంకర్ త్రీడీలో ఈ సినిమాను చూపిస్తున్న నేపద్యంలో భారతదేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీలలో ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఇదే క్రమంలో ఈ సినిమా 'బాహుబలి' రికార్డులను పగలగొడుతుంది అని అనేకమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.'2.ఓ' సినిమాలో రజినీకాంత్ మరియు అక్షయ్ కుమార్ నటిస్తుండడంతో సినిమాపై ఇప్పటికే చాలా క్రేజ్ ఏర్పడింది.
 
అయితే ఈ క్రమంలో ఈ సినిమాకి గురించి వచ్చిన ఒక వార్త సినిమాపై ఉన్న క్రేజ్ మరింత తారా స్థాయికి పెంచేసింది. శంకర్ '2.ఓ' సినిమాకు ముందు రోబో తీయడం జరిగింది ఆ సినిమాకి కొనసాగింపుగా ప్రస్తుతం '2.ఓ' వస్తుంది..ఈ నేపథ్యంలో రోబో సినిమాలో రజినీకాంత్ కి జోడీగా నటించిన ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో కూడా సీక్వెల్ అయిన కారణంగా రజినీకాంత్ భార్యగా మొదట్లోనో లేదా చివర్లోనో ఐశ్వర్య రాయ్ కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. '2.ఓ' చిత్రంలో ఒక హీరోయిన్ గా అమీజాక్సన్ కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఆమె ఒక రోబో అని వసీకర్ తో ఆ రోబో ప్రేమలో పడుతుందని కూడా కథ గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. వసీకర్ భార్యగా ఐశ్వర్య రాయ్ కొద్ది సమయం కనిపించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో రావడంతో ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భీభత్సంగా ఉన్న నేపథ్యంలో..ఈ వార్తతో '2.ఓ' చిత్రంపై అంచనాలు మరింత పెరిగి పోయాయి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop