రోబో 2.0 లో కథ లేదు అన్నవాళ్లకి ఈ ఆర్టికల్ చూపించండి !

By Xappie Desk, November 04, 2018 15:14 IST

రోబో 2.0 లో కథ లేదు అన్నవాళ్లకి ఈ ఆర్టికల్ చూపించండి !

పాతిక రోజుల కౌంట్ డౌన్ తరవాత రజినీకాంత్ రోబో 2 సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది, ఈ సినిమా ట్రైలర్ కోసం తలైవర్ ఫాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూసారు. ఈ నెల 29 న ఈ సినిమా విడుదల అవుతోంది. ట్రైలర్ అధ్బుతంగా ఉన్నా కూడా కొన్ని నెగెటివ్ కామెంట్ లు వినపడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా నిండా ఈ సినిమా కి కథ లేదు అనీ కేవలం విజువల్ ఎఫ్ఫెక్ట్స్ మీదనే ఆధార పడిపోయారు అనే మాట వినపడింది. అయితే కొన్ని ఎపిసోడ్ లు మాత్రం ట్విస్ట్ లని మించిన ట్విస్ట్ లు ఉంటాయి అనీ ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చే విధంగా ఈ సినిమా శంకర్ రూపొందించాడు అనీ అంటున్నారు. సెకండ్ హాఫ్ లో వసీను ఏమార్చడానికి అక్షయ్ రజని రూపంలోనే వచ్చి ఓ పావు గంట పాటు మొత్తం ఉక్కిరిబిక్కిరి చేసే అరాచకం సృష్టిస్తాడట. దాని గురించి ప్రేక్షకులు గెస్ చేయలేని విధంగా రాసుకున్నట్టు వినికిడి. ట్రైలర్ చివరి షాట్ లో అది బిట్ రూపంలో చూపించినా సినిమాలో ఏ భాగంలో అది వస్తుందో ఊహించలేనంత గొప్పగా ఈ ఎపిసోడ్ రాసుకున్నాడట. ఇక క్రికెట్ స్టేడియం లో 20 నిమిషాల ఎపిసోడ్ ని ప్రకృతి అత్యవసరంగా పిలిచినా వెళ్లలేనంత మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి ఊహకందని విశేషాలు 2.0 చాలా ఉండబోతున్నాయన్న మాట.


Forum Topics


Top