ఎక్స్ క్లూజివ్: 2.0 మినీ రివ్యూ!

By Xappie Desk, November 22, 2018 19:12 IST

ఎక్స్ క్లూజివ్: 2.0 మినీ రివ్యూ!

భారతదేశంలోనే అతి పెద్ద బడ్జెట్తో తెరకెక్కిన రోబో 2.0 చిత్రం భారీ విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. రజనీ శంకర్ కాంబినేషన్ లో చిత్రం ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న కోరిక ఇంకొక వారం రోజుల్లో తీరనుంది. అడ్వాన్సు బుకింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి స్టార్ట్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. మరో రెండో రోజుల్లో ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి రావొచ్చు. ఇక్కడి విశేషం ఏమిటంటే ఈ చిత్రం తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ స్క్రీన్ లలో రిలీజ్ అవుతొంది.
 
ఏపీ తెలంగాణ మొత్తం కలిపి దాదాపు 1200 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల కానుంది. తమిళనాడులో 750 స్క్రీన్లలో ఇది జనాల ముందుకు రానుoడగా, కర్ణాటకలో మాత్రం రికార్డు స్థాయిలో ఏడు వందల స్క్రీన్లలో రిలీజ్ కానుంది. కేరళలో 500 స్క్రీన్లు డిసైడ్ అయినట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేలకు పైగా స్క్రీన్లు ఖరారు కావొచ్చని సమాచారం. ఇది విడుదల రోజుకు ఫిక్స్ అయిన థియేటర్లు. పెట్టడానికి వస్తే ఇవే థియేటర్లు కొనసాగుతాయి.
 
ఇది చిత్రం ప్లస్ లు మైనస్ లు గురించి మాట్లాడుకుంటే సెన్సార్ టాక్ బోలెడన్ని విశేషాలు చెప్పింది. అసలు విషయానికి వస్తే ఈ చిత్రం నిడివి రెండు గంటల 29 నిమిషాలు. రోబో మొదటి పార్ట్ మూడు గంటలు ఉంటుంది. అయితే అందులో ఆరు ఫుల్ లెన్త్ పాటలు ఉన్నాయి. ఇలా కొంచెం తక్కువ సమయం ఉన్న ఈ చిత్రం తాగకుండా బాగా రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు. అలాగే చివరి అర్ధగంటలో కళ్ళు మిరుమిట్లు గొలిపే వీఎఫెక్స్ షార్ట్ లు, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని అన్నారు. క్లైమాక్స్ గుడ్లప్పగించి చూసే రేంజ్ లో ఉంటుందని సెన్సార్ టాక్. చివరి అరగంట సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తడం ఖాయమట. నేరుగా కథలోకి వెళ్ళిపోవడం అనవసరమైన ట్రాకులు లేకుండా నేరేషన్ చేయడం మరో అసెట్ గా చెబుతున్నారు. రజిని కన్నా అక్షయ్ కుమార్ విలనిజం చిత్రానికి హైలెట్గా నిలుస్తుందట.
 
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో కేవలం నాలుగు పాటలు ఉండడంతో మ్యూజిక్ కి పెద్దగా స్కోప్ లేనట్లే. రోబోలో ఐశ్వర్య రాయ్ రేంజ్ లో ఇందులో అమీ జాక్సన్ ట్రాక్ ఉండదని అంటున్నారు. రోబో లో అంతో ఇంతో ఉన్న కామెడీ ఇందులో అంతగా ఉండకపోవచ్చు. అయితే చివరికి ఇక్కడ మైనస్ గా చెప్పబడింది అంశాలే అక్కడ ప్లస్ కావచ్చు. ఏదేమైనా 29వ తేదీన శంకర్ చేసిన మాయ మన అందరిని విస్మయానికి గురిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 


Forum Topics


Top