డిసెంబ‌ర్ 27న విన‌య విధేయ రామ గ్రాండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

By Xappie Desk, December 24, 2018 17:10 IST

డిసెంబ‌ర్ 27న విన‌య విధేయ రామ గ్రాండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `విన‌య విధేయ రామ‌`. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. భారీ సెట్‌లో తుది పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటంది. ఈ పాట చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఈ నెల 27 న యూస‌ప్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ ప్ర‌ముఖులు, మెగాభిమానుల స‌మ‌క్షంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా... స్టార్‌ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - `మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో `విన‌య‌విధేయ‌రామ‌` సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి అంచ‌నాలు పెరుగుతూ వ‌స్తున్నాయి.

మెగాభిమానులు, ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్ సోష‌ల్ మీడియాలో క్రియేట్ చేసిన సెన్సేష‌నే అందుకు సాక్ష్యం.



Top