చోట ముద్దు వ్యవహారం.. ఫైర్ అవుతోన్న నెటిజెన్ లు .. యాక్షన్ తీసుకోబోతున్న MAA association ?

By Xappie Desk, November 13, 2018 12:12 IST

చోట ముద్దు వ్యవహారం.. ఫైర్ అవుతోన్న నెటిజెన్ లు .. యాక్షన్ తీసుకోబోతున్న MAA association ?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ లని సరిగ్గా ట్రీట్ చెయ్యడం లేదు అనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. రాధిక ఆప్టే లాంటి వాళ్ళు అయితే సౌత్ సినిమాల్లో హీరోయిన్ లని మనుషుల్లా కూడా చూడరు అంటూ ఎప్పుడూ గొడవ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ లలో చేసే కాంట్రవర్సీ లు అంతా ఇంతా కాదు. అయితే రీసెంట్ గా ఒక అంశం అందరినీ కలవార పెడుతోంది. కవచం సినిమా వేడుక లో చోట కే నాయుడు కాజల్ అగర్వాల్ కి షాకింగ్ గా ముద్దు పెట్టెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఒక హీరోయిన్ కి స్టేజీ మీద చెప్పకుండా , ప్లాన్ లేకుండా అల మీద పడి ముద్దు పెట్టడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్ లు .. వారిద్దరి మధ్యా ఏదైనా ఉంటె ప్రైవసీ లో చూసుకోవాలి కానీ ఇలా రచ్చకి ఎక్కడం ఏంటి అంటూ ఉన్నారు. చోట కే నాయుడు కి పెళ్ళయ్యింది ఎప్పుడో - పిల్లలు కూడా ఉన్నారు. కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ .. ఇలాంటి చర్యలు చాలా దారుణం అనీ అంటున్నారు. ఆ ముద్దు పెట్టిన వీడియో జాగ్రత్తగా గమనిస్తే ఈ అంశం జరిగిన కాసేపటికి కాజల్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఫంక్షన్ లో. కాజల్ కి వెంటనే రెస్పాండ్ అయ్యే టైం కూడా లేకుండా చోట ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం అంటున్నారు అందరూ. ఇప్పటికే మీ టూ ఉద్యమం నడుస్తూ ఉన్న టైం లో ఇంత దారుణంగా సౌత్ లో టాప్ హీరోయిన్ పైన ప్రవర్తించడం ఏంటి అంటూ మహిళా సంఘాలు కోప్పడుతున్నాయి. MAA association వారు కూడా త్వరలో  చోట కే నాయుడు మీద యాక్షన్ తీసుకునే అవకశాలు ఉన్నాయి అని అంటున్నారు. కాజల్ కి చోట అలా చెయ్యడం నచ్చినా నచ్చకపోయినా పబ్లిక్ డీసేన్సీ అనేది ఒకటి ఉంటుంది అనీ దాన్ని అతిక్రమించకూడదు అనీ అంటున్నారు చాలామంది.


Forum Topics


Top