RRR లాంచ్ కి నందమూరి బాలకృష్ణ ఎందుకు రాలేదు ? కారణం ఇదే !

By Xappie Desk, November 11, 2018 14:19 IST

RRR లాంచ్ కి నందమూరి బాలకృష్ణ ఎందుకు రాలేదు ? కారణం ఇదే !

ఎస్.రాజమౌళి- రామారావు-రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ RRR నేటి ఉదయం 11 గంటల 11 నిమిషాలకు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది .. అయితే ముఖ్య అతిధి గా చిరంజీవి కనిపించారు కానీ బాలకృష్ణ రాకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం యంగ్ యమ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఒకటే టెన్షన్. చరిత్రను తిరగరాసే మరో గ్రేట్ మూవీకి జక్కన్న అంకురార్పణ చేస్తున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత మళ్లీ ఎలాంటి సంచలనాలకు తెరతీస్తాడోనన్న ఉత్కంఠ నిలువనీయడం లేదు. ఇదే ఎగ్జయిట్ మెంట్ తో ఏడాదిన్నర కాలంగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. అయితే బయో పిక్ షూటింగ్ లో బిజీ గా ఉండి బాలకృష్ణ రాలేకపోయారు అనే మాట వినపడుతోంది. ఇకపోతే ఇంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి డివివి ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత దానయ్య మీడియాని ఆహ్వానించకపోవడంపై టాలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

 
Journalists, who have a passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top