RRR' షూటింగ్ లో మొట్టమొదటి సీన్ ఇదే !

By Xappie Desk, November 12, 2018 10:33 IST

RRR' షూటింగ్ లో మొట్టమొదటి సీన్ ఇదే !

తెలుగు సినిమా రంగంలో ఆదివారం ఒక విభిన్నమైన సినిమాకి చరిత్రాత్మక కలిగిన సినిమాకి వేదికయ్యింది. భారతదేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఇద్దరూ నటించబోయే సినిమాకి తెలుగు సినిమా రంగంలో ఉన్న చాలామంది ప్రముఖులు వచ్చి ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకి ‘ఆర్ ఆర్ ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.
 
ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు ప్రత్యర్థులుగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలో మొదలు కాబోయే ఈ సినిమా మొట్టమొదటిసారిగా వీరిద్దరిపై భారీ ఫైట్ సన్నివేశాలు చిత్రీకరించాలన్నే ఆలోచనలో రాజమౌళి సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
 
సినిమాలో ముందు ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రత్యర్థులుగా కనిపించిన..చివరాకరికి కలుసుకుంటారని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఈ క్రమంలో ఇంత భారీ చిత్రానికి తెలుగు సినిమా రంగంలో ఉన్న పెద్ద పెద్ద ప్రముఖులు మరియు మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్ర, దగ్గుబాటి రానా, అల్లు అరవింద్..తదితరులు వచ్చారు. బాహుబలి అతి పెద్ద విజయం తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాపై తెలుగు సినిమా రంగంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక అంచనాలు నెలకొన్నాయి.
 
Journalists, who have a part-time passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top