జగన్ స్కెచ్: కడపలో కీలకనేత వైసీపీలోకి..?

By Xappie Desk, September 14, 2018 10:43 IST

జగన్ స్కెచ్: కడపలో కీలకనేత వైసీపీలోకి..?

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పార్టీ హవా రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ పరిణామంతో రాష్ట్ర ప్రజలు జగన్ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్నారని చాలా సర్వేలలో తేలింది. దీంతో రాజకీయాల్లోకి వద్దామని కొత్తగా వస్తున్న వారు చాలామంది వైసిపి పార్టీ కండువా కప్పుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో మాజీ నాయకులు అలాగే ఇతర పార్టీకి చెందిన వారు కూడా వైసీపీలోకి రావడం విశేషం.
 
ఇటీవల నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రముఖ రాజకీయవేత్త తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి జగన్ సమక్షంలో ఇటీవల వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు...ఈ విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఇదే క్రమంలో కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
 
ఆనం రాంనారాయణరెడ్డి.. కడప జిల్లా వెళ్లి డీఎల్ రవీంద్రారెడ్డిని కలిశారు. ఖాజీపేటలోని రవీంద్రారెడ్డి నివాసంలో వారు చర్చలు జరిపారు. జగన్ దూతగా.. పార్టీలోకి రవీంద్రారెడ్డిని ఆహ్వానించేందుకే ఆనం రాంనారాయణరెడ్డి డీఎల్‌ను కలిసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో ఆనం..డీఎల్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ హయాంలో కలిసి పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో... క్యాబినెట్ మంత్రులుగా కొనసాగారు. ఇద్దరు నేతల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది..దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ డీఎల్‌కు రాయబారం పంపినట్టు కనిపిస్తోంది. మరి డీఎల్ రవీంద్రారెడ్డి వైసిపి పార్టీ లోకి వస్తారో రారో...అది కొద్ది నెలలు ఆగితే గాని తెలియదు.Top