వచ్చే ఎన్నికల్లో గుంటూరు వేమూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ వార్ వన్ సైడే..!

 వచ్చే ఎన్నికల్లో గుంటూరు వేమూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ వార్ వన్ సైడే..!

గుంటూరు జిల్లా రాజకీయాలలో వేమూరు నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ నుండి పోటీ చేసినవారు గెలుపొందిన రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని గతంలో అనేక సందర్భాలు ఉన్నవి. 1978లో ఏర్పాటు వెంకట్రావు కాంగ్రెస్ నుండి గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. 1983లో తెలుగుదేశం నుండి నాదెండ్ల భాస్కరరావు గెలుపొంది రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టారు. 1985లో కోడలి విరయ్యా, 1989లో ఆలపాటి ధర్మారావు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. 1994, 1999లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ మంత్రిగా పనిచేశారు. 2004లో డాక్టర్ సతీష్ పాల్ రాజ్ గెలుపొంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009, 2014లో నక్కా ఆనందబాబు పోటీ చేసి స్వల్ప మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్నారు. అదే కోవలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో నూతన పార్టీని స్థాపించిన జనసేనకు వేమూరు నుండి విజయం లభిస్తుందని పార్టీలకు అతీతంగా ప్రజలో చర్చ జరుగుతుంది.
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రజల్లో కొట్టిన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో గణాధీ కమలాకర్ జనసేన పార్టీకి అండగా ఉంటూ పార్టీ కేడర్ను బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మెమొరి లో జరిగిన జనసేన సభకు ప్రజలు భారీగా తరలిరావడం, ఆ సభ సక్సెస్ కావడంతో కమలాకర్, జనసేన పార్టీకి ప్రజల్లో మంచి పట్టు వచ్చిందనే చెప్పాలి. మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గం లో భారీగా జనం తరలిరావడం జనసేనకు కలసోచ్చిన అంశమనే చెప్పాలి. కొత్త పార్టీకి జనంలో అన్ని వర్గాలు అనతికాలంలో మంచి పట్టు రావడం కుల మతాలకతీతంగా చుండూరు, అమర్తలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మొదలైన ఐదు మండలాల్లో జనసేన పార్టీ సానుభూతిపరులు ఉండటం విశేషం.
 
ఇంకా అధికారానికి 10 మాసాల వ్యవధి ఉండడంతో కొందరు నాయకులు జనసేన వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటినుండి నియోజకవర్గంలో పునాది వేసుకున్న వారు సీటు తెచ్చుకుంటే గెలుపు సునాయాసమవుతుందని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక రాష్ట్రం రాజకీయంలో వ్యవహరించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో మంచి పట్టు ఉండటం, అభ్యుదయ భావాలు కలిగిన జనసేన పార్టీకి అనుకున్న దానికంటే అధిక శాతం సీట్లు రావడం ఖాయమని, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్పడం విశేషం. వేమూరు నియోజకవర్గం లో క్యాడర్ ను, పార్టీ నాయకులను, ప్రజలకు చేరువయ్యే వ్యక్తిని చూడాలని జనసేన నాయకుని కోరడం విశేషం.Top