ఎన్టీఆర్ బయోపిక్ లో కేసిఆర్ పాత్ర..?

By Xappie Desk, September 14, 2018 11:13 IST

ఎన్టీఆర్ బయోపిక్ లో కేసిఆర్ పాత్ర..?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చి తెలుగు జాతికి దేశంలోనే ఒక గుర్తింపు తీసుకు వచ్చారు. ముఖ్యంగా తెలుగు ప్రజలను ఢిల్లీ పెద్దలకు తనదైన శైలిలో రాజకీయం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి దిమ్మతిరిగిపోయే విధంగా షాకిచ్చారు ఎన్టీఆర్. దీంతో తెలుగోడి పౌరుషం ప్రపంచానికి చాటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్రను ఆయన కుమారుడు హిందూపురం శాసనసభ సభ్యుడు టిడిపి నాయకుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో పాత్ర కోసం భారీ తారాగణమే ఎంచుకున్నారు బాలయ్య బాబు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాజాగా కెసిఆర్ పాత్ర గురించి ఫిలిం నగర్ లో ఒక టాక్ వినపడుతోంది.
 
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను చూపించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ.. ఎన్టీఆర్ బయోపిక్ లో కేసీఆర్ పాత్ర.. సన్నివేశం ఎలా ఉంటుందన్న దానిపై వస్తున్న సమాచారం ప్రకారం.. తన కుమారుడు కేటీఆర్ ను వెంట పెట్టుకొని ఎన్టీఆర్ వద్దకు కేసీఆర్ వస్తారని.. ఆ సన్నివేశంలో కేసీఆర్ పాత్రను ఒక ప్రముఖ నటుడు పోషిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. ఆంధ్రాలో ఎన్నికల కంటే ముందే ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు బాలకృష్ణ.Top