కేసీఆర్ ప్రభుత్వం పై ఘాటైన విమర్శలు చేసిన వి. హనుమంతరావు..!

By Xappie Desk, September 14, 2018 14:03 IST

కేసీఆర్ ప్రభుత్వం పై ఘాటైన విమర్శలు  చేసిన వి. హనుమంతరావు..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంత రావు టిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో మంచినీరు కంటే మద్యం బాగా అందుబాటులో ప్రజలకు దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన సభ నిర్వహించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ రెండు వరకు 293 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని,దీనిని బట్టి మద్యం ఎలా విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యం ఎలా ప్రవహిస్తుందో అర్దం అవుతుందని ఆయన అన్నారు.
 
& ఈ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్నానని ఆయన అన్నారు.. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టలేని వారు రాష్ట్రాన్ని ఏం పరిపాలించాగలరని అంటున్నారు. ఇదే క్రమంలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కి వెళ్లిన కేసీఆర్ కి ముందు ముందు షాకులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని...ఫైనల్ షాక్ తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇస్తారని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు.Top