టిడిపిలోకి జూనియర్ ఎన్టీఆర్..కంగారుపడుతున్న నేతలు ?

By Xappie Desk, September 14, 2018 14:11 IST

టిడిపిలోకి జూనియర్ ఎన్టీఆర్..కంగారుపడుతున్న నేతలు ?

తెలుగు దేశం పార్టీ రాజకీయాల్లో నందమూరి కుటుంబాన్ని నారా చంద్రబాబు పక్కన పెడుతున్నారని టాక్ ఎప్పటి నుండో వినబడుతుంది. ఇటీవల మరణించిన నందమూరి హరికృష్ణకి కూడా గతంలో పార్టీలో సరైన గౌరవప్రథమైన స్థానం ఇవ్వకుండా చంద్రబాబు పక్కన పెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులలో వినబడుతున్న మాట. అయితే తెలుగుదేశం పార్టీలో నందమూరి నారా కుటుంబాల మధ్య ఇంత జరిగినా గాని ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు బయటపడలేదు.
 
అయితే తాజాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించడంతో..ఆయన స్థానాన్ని నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కి కట్టబెట్టాలని చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. ఇదే క్రమంలో చంద్రబాబు కూడా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ లో వినపడుతున్న టాక్. అయితే మరోపక్క ఈ వార్త తెలుసుకున్న టీడీపీలో ఉండే చంద్రబాబు అత్యంత సన్నిహితులు కంగారుపడుతున్నారట.
 
జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లో ఎంటర్ అవుతే లోకేష్ కి పార్టీలో కొద్దిగా వెయిట్ తగ్గుతుందని అంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే మరోపక్క ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ లో బలమైన పార్టీగా రాణించాలంటే జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలో అడుగుపెడితే బెటర్ అని అంటున్నారట టిడిపి సీనియర్ నాయకులు. మరి రానున్న రోజుల్లో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.Top