వైఎస్ బయోపిక్ లో జగన్ పాత్రలో టాలీవుడ్ నైజాం మెగా స్టార్..?

By Xappie Desk, September 14, 2018 14:24 IST

వైఎస్ బయోపిక్ లో జగన్ పాత్రలో టాలీవుడ్ నైజాం మెగా స్టార్..?

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఓటర్లను ప్రభావితం చేయడానికి తమ పార్టీ అధినేత జీవిత చరిత్రలు వెండితెరపై తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని ‘ఎన్టీఆర్ బయోపిక్’ గా ఆయన కుమారుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సినిమా లో చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు.
 
ఇదే క్రమంలో మరోపక్క వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే..ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి రాజశేఖర రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ కొడుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు అయిన జగన్ మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయంపై తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ పాత్రలో గతంలో కోలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన సూర్య తమ్ముడు కార్తీ నటిస్తున్నారు అన్న వార్తలు వచ్చాయి..అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని తర్వాత తేలింది.
 
అయితే తాజాగా జగన్ పాత్రలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ జగన్ పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న వార్త. దేవరకొండ ఆ పాత్రలో నటిస్తే సినిమాకి బిజినెస్ పరంగా అది లాభిస్తుంది. అందుకే అతడికి భారీ పారితోషికం ఆఫర్ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఈ పాత్రలో నటిస్తే అది నైజాం మెగాస్టార్ గా దూసుకొస్తున్న దేవరకొండకు ప్లస్ అవుతుంది. ఇటు తెలంగాణతో పాటు - అటు ఏపీ - రాయలసీమలోనూ విజయ్ దేవరకొండ ఇమేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్న విశ్లేషణ సాగుతోంది. ఇప్పటికి ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని యూనిట్ ధృవీకరించలేదు.ఒకవేళ నిజంగా జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ కనబడితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.Top