బండ్ల గణేష్ జనసేన పార్టీ లో చేరకపోవడానికి కారణం?

By Xappie Desk, September 14, 2018 16:32 IST

బండ్ల గణేష్ జనసేన పార్టీ లో చేరకపోవడానికి కారణం?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విపరీతంగా అభిమానించే వారిలో ముందు వరుసలో ఉంటారు నిర్మాత బండ్ల గణేష్. చాలా సినిమా వేడుకలలో ఆడియో వేడుకలో ఆయన పవన్ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకునే వచ్చారు...పవన్ నాకు దేవుడు.. నాకు ఆదర్శవంతుడు అని చాలా సందర్భాలలో అన్నారు..ఈ విషయం మనకందరికీ తెలిసినదే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బండ్ల గణేష్ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ సమక్షంలో చేరడం జరిగింది.
 
అయితే బండ్ల గణేష్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం...తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అంతగా ప్రభావితం చేయని నేపథ్యంలో పైగా పార్టీ ఇంకా నిర్మాణ దశలో ఉన్న క్రమంలో బండ్ల గణేష్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ బినామి అనే టాక్ ఉన్న గణేష్...బొత్స ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్లు వస్తున్న సమాచారం. మరోపక్క కొంతమంది నాయకులు జనసేన పార్టీ మీద నమ్మకం లేక అని అంటున్న వారికి బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించినట్లు సమాచారం.
 
కేవలం జనసేన పార్టీ తెలంగాణలో నిర్మాణ దశలో ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కి వెళ్లాను తప్ప...నా బాస్ పవన్ కళ్యాణ్ పార్టీపై నమ్మకం లేక కాదు అని తన సన్నిహితుల దగ్గర వాపోయారట. నా ఊపిరి ఉన్నంతవరకు నా శ్వాస ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎటువంటి బాండింగ్ ముందు నుంచి ఉందో అదే చివరి వరకు ఉంటుందని పేర్కొన్నారట. ఇదే క్రమంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ లోకి వెళ్లడని పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తారని అంటున్నారు పవన్ సన్నిహితులు. తనకు తెలిసిన వ్యక్తి వ్యక్తిగతమైన నిర్ణయాలలో పవన్ ఎప్పుడు ఇంటరాక్ట్ అవరని అంటున్నారు. పైగా రాజకీయాలలో బండ్ల గణేష్ మంచి రాజకీయ నేతగా రావాలని కోరుకునే వాళ్ళలో పవన్ కళ్యాణ్ కూడా ముందుంటారని పేర్కొంటున్నారు పవన్ సన్నిహితులు.Top