తోడకొట్టిన టీడీపీ సైలెంట్ ఐపోయిందే !

By Xappie Desk, September 24, 2018 10:38 IST

తోడకొట్టిన టీడీపీ సైలెంట్ ఐపోయిందే !

తాజాగా ఇటీవల ఏపీ సీఎం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును బాబ్లీ వ్యవహారంలో కేంద్రం రాజకీయంగా ఇరుకున పెట్టే విధంగా అరెస్టు చేయడానికి సిద్ధమైందని తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు మీడియా ముందు లబోదిబోమంటూ అది జరుగుతుంది ఇది జరిగి పోతుంది అంటూ నానా గగ్గోలు పెట్టారు. మొత్తంమీద బాబ్లీ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని అటు తెలంగాణ రాజకీయాలలోనూ ఇటు ఏపీ రాజకీయాలలోనూ ఓట్లను కొల్లగొట్టడానికి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు.
 
ముఖ్యంగా ఇటీవల దివంగత వై.ఎస్ హయాంలో తాను తెలంగాణ కోసం పోరాడాను అని.. తనను వైఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని..ఇలా చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టుగా చెప్పుకున్నాడు. అయితే బాబుగారు బాబ్లీ డ్రామాను నడిపించిన సమయానికి వైఎస్ లేనే లేడు. ఆయన అప్పటికే మరణించాడు. అయినప్పటికీ.. చంద్రబాబు నాయుడు తన చీప్ ట్రిక్స్ తో ఏదో రాజకీయ లబ్ధిని పొందే ప్రయత్నం చేశాడు. బాబు ఏది చెబితే అదే నిజం అన్నట్టుగా పచ్చ పత్రికలుకూడా 2010లో వైఎస్ బతికే ఉన్నాడన్నట్టుగా వార్తలను ఇచ్చాయి. ఇలా ఇరకాటంలో పడ్డారు. ఇక అంతిమంగా బాబ్లీ వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు రావడం కొత్త ఏమీ కాదని.. ఇప్పటికే ఏడెనిమిది సార్లు వచ్చాయని, వాటిని చంద్రబాబు నాయుడు అసలు కేర్ చేయలేదని.. ఇప్పుడు రాజకీయం చేయడానికి బాబ్లీ నోటీసులను ఉపయోగించుకుంటున్నాడని స్పష్టం అయిపోయింది.
 
మొత్తం మీద అసలు విషయాలు బయటకు రావడంతో ఇటీవల ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని ప్రత్యర్థులపై తొడలు కొట్టిన టిడిపి నేతలు బాబ్లీ వ్యవహారంలో నోరు మెదపటం లేదు. దీంతో ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో రావటంతో నెటిజన్లు చంద్రబాబుపై టీడీపీ నాయకులపై మండిపడుతున్నారు. ఒక బాధ్యతగల పదవిలో ఉండి ప్రజలకు సేవ సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్సిన ముఖ్యమంత్రి..ఇలాంటి చీప్ ట్రిక్స్ వ్యవహరించటం సిగ్గుచేటు అని విమర్శలు చేస్తున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు చంద్రబాబుకి మరిచిపోని విధంగా తీర్పు ఇస్తారని మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.Top