పోలవరం ప్రాంతంలో నారా లోకేష్ పై సెటైర్ లు వేసిన పవన్..!

By Xappie Desk, October 11, 2018 09:34 IST

పోలవరం ప్రాంతంలో నారా లోకేష్ పై సెటైర్ లు వేసిన పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై ముఖ్యంగా నారా లోకేష్ పై అదిరిపోయే సెటైర్లు వేశారు. పోలవరం ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించి ఉన్న అధికారులను జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలతో సమావేశం అయి వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో జనసేన పాతుకుపోయి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం చంద్రబాబు, లోకేష్ లు భయపడుతున్నారని పవన్‌ విమర్శించారు.
 
ఇదే క్రమంలో పోలవరం నిర్వాసితులకు సరైన న్యాయం చేయడం లేదని చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైసిపి అధినేత జగన్ అధికారంలోకి వస్తే దోపిడీ వ్యవస్థ మళ్లీ వస్తుందని..అటు వంటివి రాకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. మరి అదేవిధంగా కౌలు రైతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయిస్తామని పవన్ ఈ సందర్భంగా అక్కడున్న రైతులకు భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకుంటారా లేకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్కు లేఖ రమ్మంటారా అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు పవన్.Top