తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు ఆస్తులపై సోదాలు..!

By Xappie Desk, October 11, 2018 14:01 IST

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు ఆస్తులపై సోదాలు..!

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంటి పై ఐటీ, ఈడీ సోదాలు నిర్వహించినట్లు వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపై ప్రజాప్రతినిధులపై It దాడులు నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కి చెందిన 120 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని ఐటీ, ఈడీ సంస్థలు సీజ్ చేసినట్లు సమాచారం.
 
కాగా కంపెనీల ముసుగులో ఆర్థిక అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా విదేశీ బ్యాంకులనుంచి వందలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని, వాటిని ఎగవేయడం, ఆ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడంతో సుజనా చౌదరి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనపై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. అంతేకాకుండా విచారణ నిమిత్తం గతంలో కోర్టుకు హాజరైనవిషయం కూడా మనకందరికీ తెలిసినదే.
 
ఈ క్రమంలో ఈడీ దాడులకు సంబంధించి ఇటువంటి సమాచారం అధికారికంగా బయటకు రాలేదు. ఇదే క్రమంలో ఈడీ దాడులపై ఏ విషయము బయటకు రానివ్వలేదు స్పందించలేదు సుజనా చౌదరి. తాజాగా కాకుండా గతంలో కూడా సుజనా చౌదరి కి సంబంధించిన ఆస్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది.Top