చంద్రబాబు పై పొగడ్తల వర్షం కురిపించిన జేసీ

By Xappie Desk, October 11, 2018 12:11 IST

చంద్రబాబు పై పొగడ్తల వర్షం కురిపించిన జేసీ

అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పై పొగడ్తల వర్షం కురిపించారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ బహిరంగ సభలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ నదుల అనుసంధానం గురించి గతంలో చాలా మంది రాజకీయ నాయకులు కామెంట్లు చేశారు కానీ..అది చేతల్లో చేసి చూపించింది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు అని...రాజకీయాల్లో ఆయన అసలు సిసలైన మొగోడు అంటూ చంద్రబాబును తన పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు.
 
విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో ఇటువంటి అద్భుతాలు చేయాలంటే అది కేవలం చంద్రబాబుకే సాధ్యం అని పేర్కొన్నారు జేసీ దివాకర్ రెడ్డి. అంతేకాకుండా డబ్బులు లేకపోయినా అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతున్నారని డబ్బులెక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మీ దగ్గరేమైనా అక్షయ పాత్ర ఉందా లేక ఆంధ్రా కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయోనన్న రహస్యం మాత్రం చెప్పాల్సిందేనని జేసీ చంద్రబాబును చమత్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పనులు రాయలసీమకు చంద్రబాబు చేశారని అన్నారు. అంతేకాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలందరూ చంద్రబాబుకి తోడుగా ఉండాలని ఆయనకు రుణపడి ఉండాలని సూచించారు జెసి.Top