విజయసాయి రెడ్డి దగ్గర ఫైర్ అయిన వంగవీటి రాధ..?

By Xappie Desk, October 11, 2018 12:08 IST

విజయసాయి రెడ్డి దగ్గర ఫైర్ అయిన వంగవీటి రాధ..?

గత కొంత కాలం నుండి వైసీపీ పార్టీ విజయవాడ ప్రాంతానికి చెందిన వంగవీటి రాధా పొలిటికల్ ఎపిసోడ్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో వైసిపి సెంట్రల్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేద్దామనుకున్నా రాధా కి వైసీపీ అధిష్టానం నుండి ఆశించిన రీతిలో టికెట్ రాకపోవడంతో వైసీపీ పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వంగవీటి రాధ. ఈ క్రమంలో వంగవీటి రాధా అని బుజ్జగించడానికి వైసిపి సీనియర్ నాయకుడు పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. విజయసాయిరెడ్డి రాధాతో భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు రాధాతో చర్చించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యాలంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే విజయసాయిరెడ్డి ఆఫర్ పై రాధా మౌనంగా ఉండిపోయారని సమాచారం.
 
2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన వంగవీటి రాధా..తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల వంగవీటి రాధాను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పై దృష్టి పెట్టాలని వైసీపీ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో మొన్నటి వరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పై దృష్టిసారించిన వంగవీటి రాధా కు భంగపాటు కలిగింది మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రూపం లో. ఇటీవల వైసిపి పార్టీ లోకి వచ్చిన మల్లాది విష్ణు సడన్ గా వైసీపీ అధిష్టానం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ కేటాయించడంతో..వంగవీటి రాధా తీవ్రస్థాయిలో వైసిపి అధిష్టానంపై మండిపడ్డారు. ఈ పరిణామంతో వంగవీటి రాధాను బుజ్జగించడానికి వచ్చిన విజయసాయిరెడ్డి దగ్గర కూడా పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల ఫైర్ అయ్యారట వంగవీటి రాధ. ఇటువంటి పరిస్థితులలో వంగవీటి రాధా భవిష్యత్తు రాజకీయాలు విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని అన్ని రాజకీయ పార్టీ నేతలతో పాటు పొలిటికల్ విశ్లేషకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.Top