చంద్రబాబు పై ఫుల్ క్లారిటీ తో విమర్శలు చేస్తున్న కేసీఆర్..!

By Xappie Desk, October 11, 2018 12:01 IST

చంద్రబాబు పై ఫుల్ క్లారిటీ తో విమర్శలు చేస్తున్న కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారపర్వంలో బిజీ బిజీగా గడుపుతున్న తనకు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి పై ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్న టిఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు పై అదిరిపోయే సెటైర్లు వేస్తున్నారు. చాలా దారుణంగా 2014 ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలలో ఏకంగా పక్క రాష్ట్రం సీఎం అయినా గాని కెసిఆర్ ఏ మాత్రం వదిలిపెట్టకుండా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల నల్గొండ నిజామాబాద్ జిల్లాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలలో కేసీఆర్ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇంత దారుణంగా చంద్రబాబు పై కేసీఆర్ కామెంట్లు చేయడం వెనుక పెద్ద కథ ఉందని పొలిటికల్ వర్గాల్లో టాక్. అసలైన ఇటీవల ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుందని తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఆంధ్ర రాష్ట్రంలో సర్వే నిర్వహించిదట. ఈ సర్వేలో కచ్చితంగా వచ్చే ఎన్నికలలో ప్రస్తుత ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని తేలిందట.
 
ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పని - ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పని ముగిసినట్లేనని ప్రకటించారు. దీంతో తాజా పరిణామంతో చంద్రబాబు తనకు చివరిగా దొరుకుతున్నడని..వచ్చే ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీ ఉంటుందో ఉండధో అని ఇప్పుడే కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారట. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి అటు ఆంధ్రా లోనూ ఇటు తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఉండదని డిసైడ్ అయిపోయారు కెసిఆర్. మరి ఎన్నికలలో ఏం జరుగుతుందో చూడలి.Top