విజయనగరం జిల్లాలో చంద్రబాబు కి కొత్త అవార్డు ప్రకటించిన జగన్..!

విజయనగరం జిల్లాలో చంద్రబాబు కి కొత్త అవార్డు ప్రకటించిన జగన్..!

ప్రజా సంకల్ప పాదయాత్ర తో దూసుకెళ్ళిపోతున్న వైసీపీ అధినేత జగన్ విజయనగరం జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ అధినేత చంద్రబాబుపై ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు జగన్. రైతాంగాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరి ని మోసం చేశారని పేర్కొన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉత్తమ చీటర్ అవార్డు ఇవ్వాలని అన్నారు.
 
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 108 సర్వీసులు సరిగా పనిచేయడం లేదని టిడిపి ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు జగన్. విజయనగరం జిల్లా గజపతినగరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. `విజయనగరం జిల్లాలో 34 మండలాలు ఉంటే.. 32 మండలాలలో లోటు వర్షపాతం ఉంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయినా హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యవసాయ పురస్కారం చంద్రబాబుకి ఇవ్వనున్నారు` అని జగన్ ఎద్దేవా చేశారు.
 
వ్యవసాయం దండగ అన్న వ్యక్తికి వ్యవసాయ సంబందిత అవార్డులా? అని విమర్శించారు. చంద్రబాబు హయంలో పంట దిగుబడులు తగ్గిపోయాయ్.. రాష్ట్రం అంతా వ్యాదులు కరువుతో ప్రజలు అల్లాడుతున్నారు. అయినా కూడా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబుకి ఉత్తమ చెత్త ముఖ్యమంత్రి అవార్డు ఇవ్వాలని జగన్ అన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి మీ అందరి సహకారం కావాలని..ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్.Top