టీడీపీలో చేరడానికి సిద్ధంగా కేసీఆర్ అన్న కూతురు!

By Xappie Desk, November 09, 2018 11:08 IST

టీడీపీలో చేరడానికి సిద్ధంగా కేసీఆర్ అన్న కూతురు!

తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్య సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారు. దీని కొరకు ఆమె టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి టీడీపీలో చేరే విషయం గురించి మాట్లాడినట్టు సమాచారం.
 
గతంలో కాంగ్రెస్ లో ఉన్న రమ్య ఆ పార్టీ నేతల తీరు తో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతోనే ఆమె సైకిల్ ఎక్కడానికి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీడీపీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే రెచ్చగొట్టినట్టవుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.Top