తన భవిష్యత్తు కోసం పార్టీ ని బలి చేస్తోన్న చంద్రబాబు ?

By Xappie Desk, November 09, 2018 12:39 IST

తన భవిష్యత్తు కోసం పార్టీ ని బలి చేస్తోన్న చంద్రబాబు ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకత నెలకొంటుంది. ముఖ్యంగా విభజన సమయంలో రాష్ట్రానికి రావలసిన హామీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని..విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే అనేకసార్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో పరిపాలన విషయంలో తెలుగుదేశం పార్టీ మొత్తం అవినీతి మయం అయ్యిందని కూడా పేర్కొంటున్నారు. ఆంధ్రాలో టిడిపి పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొనఊపిరితో ఉన్న నేపథ్యంలో బాబు గారు తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ పూర్తి రాజకీయ భవిష్యత్తును తుడిచి పెట్టే విధంగా ఉందని అంటున్నారు చాలామంది రాజకీయ నేతలు.
 
ముఖ్యంగా గత ఎన్నికలలో బిజెపి పార్టీ తో దోస్తీ కలిసి ఎన్నికల్లో పాల్గొన్న చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలపడం తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులకు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలో తన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని కామెంట్లు కూడా టిడిపి నేతలు తమలో తాము చేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తెలుగు దేశం పై ఈ ఆధిపత్యపోరు కాంగ్రెస్ పార్టీ చేతులకు అప్పగించడంతో తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తలు మరియు నాయకులు చంద్రబాబు అనుసరిస్తున్న విధానంపై చీదరించుకుంటూ నట్లు సమాచారం. ఏది ఏమైనా చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు మరియు సొంత పార్టీ నేతలు అనడం గమనార్హం.Top