కెసిఆర్ కి టెన్షన్ పెట్టేస్తున్నా గద్దర్..?

By Xappie Desk, November 09, 2018 13:07 IST

కెసిఆర్ కి టెన్షన్ పెట్టేస్తున్నా గద్దర్..?

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో విధంగా రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్న పోటీ మాత్రం టిఆర్ఎస్ మరియు మహా కూటమి పార్టీల మధ్య ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో తనకు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి పార్టీల నాయకుల గురించి టెన్షన్ పడుతున్న కేసీఆర్... ప్రజా ఉద్యమ గాయకుడు మరియు నాయకుడు అయిన గద్దర్ కూడా తనకు వ్యతిరేకంగా రాజకీయ పావులు కదపడం తో మరింత టెన్షన్ పడుతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.
 
ఇదే క్రమంలో తన పార్టీ తరపున టికెట్లు వస్తాయని ఆశించిన కొంత మంది టిఆర్ఎస్ నాయకులు టికెట్లు రాకపోవడంతో భాహిరంగంగా మీడియా ముందే టి.ఆర్.ఎస్ పార్టీ పై తమ అసంతృప్తిని వెల్లడి చేస్తున్న ఈ తరుణంలో ప్రజా ఉద్యమ గాయకుడు గద్దర్ రానున్న ఎన్నికల్లో గులాబీ బాస్‌కు పోటీగా గజ్వేల్‌ నుండి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించి సంచ‌ల‌నానికి తెర‌లేపారు.
 
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజరికపు పాలన కొనసాగిందని గద్దర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్దరించబడాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తో భేటీ అయ్యారు గ‌ద్ద‌ర్‌. మొన్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలసినప్పుడు 45 నిమిషాల పాటు పాటలు పాడి వినిపించానని తెలిపారు. 'సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్రసీ' పుస్తకం గురించి వివరించానని అన్నారు. మరియు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ప్రతి పల్లెకు వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అవినీతి గురించి ప్రచారం చేస్తానని గద్దర్ వెల్లడించారు..మరియు అదే విధంగా రాజరిక పాలన పోలీ తెలంగాణాలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్న క్రమంలో..ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల ఓటర్లకు ఓటు హక్కు గురించి చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు గద్దర్.
 
మొత్తంమీద ఎన్నికల ముందు మహాకూటమి తో పాటు గద్దర్ కూడా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం లోకి దిగటంతో గులాబీ బాస్ అధినేత కెసిఆర్ కి కొత్త తలనొప్పి మొదలైంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 Top