అర్ధరాత్రి పోలీసులపై వాగ్వాదానికి దిగిన లగడపాటి రాజగోపాల్..!

By Xappie Desk, November 09, 2018 13:09 IST

అర్ధరాత్రి పోలీసులపై వాగ్వాదానికి దిగిన లగడపాటి రాజగోపాల్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..అన్యాయంగా రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ అడపాదడపా మీడియా ముందుకు వస్తూ సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. అయితే గతంలో మీడియా ముందుకు వచ్చి తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు రాజగోపాల్ పై వార్తలు రాగా..తాజాగా మరొకసారి ఆయనపై సంచలన వార్తలు బయటకు వచ్చాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేగింది.
 
హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలో సోదాలకు వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సోదాలు ఏంటంటూ పోలీసులపై లగడపాటి మండిపడ్డారు. ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. భూమి విషయంలో తన మిత్రుడైన జీపీ రెడ్డిని బెదిరింపులకు గురిచేస్తున్నారని, అర్ధరాత్రి ఈ సోదాలేంటని ప్రశ్నించారు. మొత్తంమీద ఇలా తెలంగాణ పోలీసులను అడ్డుకొని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వార్తల్లో నిలిచారు.Top