అందరికీ ఆఫర్ ఇచ్చే మోదీకి బాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

By Xappie Desk, November 09, 2018 15:26 IST

అందరికీ ఆఫర్ ఇచ్చే మోదీకి బాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పైన చాలా కాలం నుండి వివక్ష ధోరణిని ప్రదర్శిస్తున్న కేంద్రానికి చంద్రబాబు చెంప పెట్టు లాంటి నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆఫర్లు ఇచ్చే మోడీకే ఈయన ఒక ఆఫర్ ని ఇచ్చేశారు. విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాయలసీమలోని కడప లో ఒక ఉక్కు ప్లాంట్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం అక్కడ ఫీజిబిలిటీ లేదు…ఆ కమిటీ వద్దంది ఈ కమిటీ వద్దంది... మేము చాలా విషయాలు పరిశీలించాలని నాలుగు సంవత్సరాల నుండి తాత్సారం చేస్తుంది.
 
“కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో నిరాహార దీక్ష చేసిన రాజ్యసభ అభ్యర్థి సీఎం రమేష్ ను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం స్థాపించక పోయినా ఆ బాధ్యతను తాము చేపడతామని ఆయనను దీక్ష నుండి విరమింప చేసింది. ఇప్పుడు చంద్రబాబు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో అన్నట్టుగానే తన మాటను నిలబెట్టుకున్నారు. అయితే ఎందుకు ప్రైవేట్ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా కావచ్చని ఆయన కేంద్రానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు గాని సంస్థలు గానీ ముందుకు రాకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ పనిని సొంతంగా చేపడుతుందని ఆయన తేల్చేశారు.
 
విశాఖ ఇస్పాత్‌ నిగమ్‌ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి. మధుసూదన్‌ను తాత్కాలిక సీఎండీగా రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌కు నియమిస్తారు. రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌కు ముడి ఇనుమును ఏపీ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) అందిస్తుంది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగు వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించగా అందులో అత్యధిక భాగం ప్రభుత్వంతో ప్లాంటు ఏర్పాటుకు పెద్దగా ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. ఈ ప్లాంటు స్థాపనకు దాదాపు 1500 కోట్లు నుండి పది వందల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. కొన్ని మిలియన్ టన్నుల ఉక్కు ని ప్రతియేటా ఇక్కడి నుండి తయారు చేసే విధంగా ప్లాన్ చేస్తున్న కేంద్రం దాదాపు 30 సంవత్సరాలపాటు తగిన వనరులను స్థానికంగానే ఉన్నాయoటూ గనుల శాఖ, మెకాన్ గుర్తించాయి. అయితే కడపలో బాగా వీక్ అయిన టిడిపి అక్కడ తన పట్టు పెంచుకోవడానికి ఈ చర్యలు అని కొందరు అంటున్నారు. ఏదైతేనేం ఇటువంటి వరుస చర్యలతో చంద్రబాబు ఇప్పుడు మోడీకి ఒక పెద్ద తలనొప్పిగా మారారు.Top