అన్నా… సాయం చెయ్- చంద్రబాబును కలిసిన కెసిఆర్ కూతురు..!

By Xappie Desk, November 09, 2018 15:30 IST

అన్నా… సాయం చెయ్- చంద్రబాబును కలిసిన కెసిఆర్ కూతురు..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుటుంబం లో ఏదో జరుగుతుంది. ఒకపక్క ఆయన కుటుంబీకులు, పార్టీ వారు సభలలో చంద్రబాబు పైన విరుచుకు పడుతుంటే కేసిఆర్ అన్న కూతురు రమ్యా రావు చంద్రబాబును సాయం కోరుతూ అమరావతి కి వెళ్ళారు. మంగళవారం ఈవిడ ఉండవల్లిలోని ఏపీ సచివాలయంలో చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవలే మహాకూటమి ఏర్పాటు చేసిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
 
అసలు ఇక్కడ విషయం ఏమిటంటే… రమ్య రావు కరీంనగర్ నుండి పోటీ చేసేందుకు ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ నేతల వైఖరితో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. కొద్దిరోజులుగా ఆ పార్టీతో ఎడముఖం పెడముఖంగా అన్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తనను కరీంనగర్ నుండి పోటీ చేసేటట్లుగా సాయం చేయాలని చంద్రబాబును కోరడం విశేషం. లేదా కనీసం ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేయాలని ఆమె ఉత్సాహంతో ఉన్నారట.
 
ఒకవైపు హరీష్ రావు చంద్రబాబు ని ఒక రేంజ్ లో దుమ్మెత్తి పోస్తుంటే, అదే కుటుంబం చెందిన మరొకరేమో ఆయన సాయం కోరుతూ వచ్చారు. ఇదిలా ఉండగా కెసిఆర్, కేటీఆర్ కళ్లన్నీ బాబు మీరే. అది కాకుండా వారు హరీష్ రావు ని విస్మరించే విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది చాలా రోజులగా వినికిడి లో ఉన్న విషయం. అసలు కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.Top