నెల్లూరు టిడిపికి బాబు ఇచ్చిన అతి పెద్ద షాక్ చూడండి.

By Xappie Desk, November 10, 2018 10:04 IST

నెల్లూరు టిడిపికి బాబు ఇచ్చిన అతి పెద్ద షాక్ చూడండి.

నెల్లూరు జిల్లా అంతా మామూలుగానే వైసీపీకు కంచుకోటగా చెబుతుంటారు. ఏదో ఒకటి రెండు నియోజకవర్గాలకు తప్పించి అక్కడ టిడిపి కి హవానే ఉండదు. ఇటువంటి సమయంలో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా, సభ్యత్వాలు చేయించకుండా, వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ కాకపోతే ఎలా అని చంద్రబాబు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి పైన కోపడ్డారు. పనిచేసే చేయండి... చేయని వారిని వదిలేయండి అనేశారట చంద్రబాబు.
 
విషయం ఏమిటంటే పార్టీ కార్యవర్గ వ్యవహారాల్లో కోవూరు నియోజకవర్గం 171 వ స్థానంలో ఉందని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనితో ఆయన అసలు నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల కి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలా వద్దా అనే దానిపై నా ఎవరూ అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని వ్యాఖ్యలు చేయవద్దని, సమయం వచ్చినప్పుడు తానే ప్రకటిస్తానని చెప్పారట. దీంతో ఎమ్మెల్యేలు కినుకుపాటు వహిస్తున్నారు. వీరందరిలో మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
 
పార్టీ లో ఎప్పటి నుండో ఉండి అష్టకష్టాలు పడి ఏమి ఆశించకుండా సేవ చేస్తున్న వారిని కాదని పోలంరెడ్డి వంటి వారిని పిలిచి సీటిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని చంద్రబాబు కి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఈసారి పొలం రెడ్డి కి మళ్ళీ పోటీ చేసే అవకాశం లభించదు అనేది అందరి ప్రగాఢ విశ్వాసం. దీంతో ఆయన వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నా జగన్ అసలు పట్టించుకోవట్లేదు అట. అతనికి బదులుగా టిడిపి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరుని పరిశీలిస్తున్నారట. ఒకవేళ ఆయన కూడా కాకపోతే జెడ్ పి టి సి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కి టికెట్ దక్కే అవకాశం ఉందని పోలంరెడ్డి కి పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారట.
 
దీంతో మిగతా టిడిపి ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ఆ జిల్లాలో చాలా వీక్ గా ఉండే టిడిపి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కోల్పోతే ఇంకా నెల్లూరులో వైసిపి కి ఎదురు లేదంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఝలక్ ల మీద ఝలక్ లు ఇస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఏం చేయాలో పాలుపోక తాత్కాలికంగా మౌనం వహిస్తున్నారు.Top