ఆరు నెలల కోసం చంద్రబాబు హడావిడి !

By Xappie Desk, November 10, 2018 11:03 IST

ఆరు నెలల కోసం చంద్రబాబు హడావిడి !

ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సొంత పార్టీ నేతలు మెప్పుకోసం మరియు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని సంపాదించడం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపద్యంలో గిరిజనులు మరియు మైనారిటీల నమ్మకాన్ని సాధించడం కోసం ఇంకా తన ప్రభుత్వం ఆరు నెలలు ఉంటుండగా ఆ రెండు వర్గాలకు క్యాబినెట్ మంత్రుల స్థానం కల్పించడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఆ మంత్రుల స్థానాన్ని కల్పించడానికి ఈనెల 11వ తేదీన హాజరవ్వాలని ముహూర్తం ఫిక్స్ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో ప్రస్తుతం ముస్లిం మైనారిటీ గిరిజనులకు చోటు లేదు. గతంలో ఎన్నడూ ఇలా ఈ రెండు వర్గాలు లేకుండా ఏపీ మంత్రి వర్గం లేదు. దీంతో ఎన్నికలకు ముందు ఆ రెండు వర్గాలను ఊరడించేందుకు గాను చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. క్యాబినెట్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నా కూడా ఇప్పటివరకు ఆ రెండు వర్గాలకు న్యాయం చేయని చంద్రబాబు ఇప్పుడు వారిని బుజ్జగించే పని పెట్టుకున్నారు.
 
ఈ నేపద్యంలో మైనారిటీ మంత్రిగా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూక్ కి చంద్రబాబు మంత్రి పదవి ఇస్తున్నట్లు సమాచారం..ఇదే క్రమంలో గిరిజనులకు సంబంధించి మంత్రి పదవిని వీటివల్ల మావోయిస్టు చేతిలో హతమైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడిని గిరిజన కోటాలో మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కిడారి కుమారుడు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కానప్పటికి ఆరు నెలల వెసులుబాటును ఆసరాగా చేసుకుని మంత్రిని చేయనున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు గిరిజనులు మైనారిటీల నమ్మకాన్ని సాధించడం కోసం మంత్రి పదవులు ఇవ్వడం 2019 ఎన్నికలకు రాజకీయ ఎత్తుగడకు నిదర్శనమని పేర్కొంటున్నారు రాజకీయవిశ్లేషకులు.Top