బ్రేకింగ్ : హైదరాబాద్ పేరు మార్పు ?

By Xappie Desk, November 10, 2018 11:05 IST

బ్రేకింగ్ : హైదరాబాద్ పేరు మార్పు ?

దేశంలో చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి తన మార్కు రాజకీయాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో దేశంలో పేరుగాంచిన ప్రాంతాలకు ఓ మతానికి సంబంధించిన పేర్లు పెడుతూ ఆ మతానికి సంబంధించిన ఓటర్ల నాడిని పట్టుకొని తిరిగి అధికారంలోకి వద్దామని విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలో ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి నాయకుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఉన్న చాలా ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకులు ఇదే దారి పట్టారు.
 
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిజెపి నాయకుడు ఫైర్ బ్రాండ్ రాజసింగ్ మీడియాతో మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని..గతంలో హైదరాబాదును భాగ్యనగర్ గా పిలువబడేదన్న ఆయన.. ఎప్పుడైతే కులీ కుతుబ్ షాహీల పాలన ప్రారంభమైందో భాగ్యనగర్ ను హైదరాబాద్ గా మార్చినట్లు తెలిపారు. మొగల్స్ - నిజాంలు పెట్టిన పేర్లను దేశం కోసం పనిచేసిన త్యాగధనుల పేర్లతో తిరిగి మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే క్రమంలో రాజాసింగ్ మాట్లాడుతూ యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇదే తరహాలో పేరులు మారుస్తూ దేశ ప్రతిష్టను కాపాడుతున్నారని ఉదహరించారు.Top