తెరాస మెయిన్ టార్గెట్ చంద్రబాబు !

By Xappie Desk, November 10, 2018 11:07 IST

తెరాస మెయిన్ టార్గెట్ చంద్రబాబు !

తెలంగాణ రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన మహాకూటమికి చెందిన రాజకీయ నాయకులను పెద్దగా టార్గెట్ చేయని కేసీఆర్ కేవలం ఏపీ సీఎం చంద్రబాబు ని మాత్రమే టార్గెట్ చేస్తూ తన ఎన్నికల ప్రసంగంలో చంద్రబాబుపై వాడివేడి తరహాలో తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఆంధ్ర వాళ్ళు అంటూ సంభోదించిన కేసీఆర్ తాను అధికారం చేపట్టాక కేవలం చంద్రబాబు ని మాత్రమే టార్గెట్ చేసి తెలంగాణ ప్రజల్లోకి వెళ్లడం నిజంగా గమనార్హం. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన సమావేశాలలో కేసీఆర్ మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు మహాకూటమిలో భాగస్వామి అయ్యి తెలంగాణ రాజకీయాల్లో పెత్తనం చెలాయించాలని ఏపీ నూతన రాజధాని అమరావతి నుండి పాలన చేయాలని స్కెచ్ గీశాడు.అంటూ చంద్రబాబు పై సంచలన కామెంట్లు చేశారు కేసిఆర్.
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు ని తిట్టడం వల్ల తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయినా సీమాంధ్ర ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి పడవని కేసీఆర్ కి టిఆర్ఎస్ పార్టీ నేతలు సూచించడంతో..వెంటనే కేసీఆర్ సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సర్వే నిర్వహించి రిపోర్టు తెప్పించుకున్నారు. ఇందులో చంద్రబాబు విషయంలో ఉత్తరాంధ్ర - రాయలసీమ ప్రాంత వాసుల్లో మెజారిటీ సానుకూలంగా లేరని.. కోస్తా - ఆంద్రా ప్రాంతాల్లోనూ భిన్నాభిప్రాలున్నట్లు తేటతెల్లమైందట.. దీంతో రెండు మూడు రోజులుగా టీఆర్ ఎస్ నాయకులు తిరిగి చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు. ఇటీవల టిఆర్ఎస్ పార్టీలో ఉండే మెయిన్ మెయిన్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు ని చెడుగుడు ఆడుకున్నారు. దీంతో రానున్న రోజుల్లో చంద్రబాబుపై టిఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగానే టార్గెట్ చేసి తెలంగాణ ఎన్నికలలో బాబు గారి పరువు అడ్డంగా తీసేస్తారని పేర్కొంటున్నారు రాజకీయ పరిశీలకులు.Top