జగన్ పై దాడి చేయకముందే శ్రీనివాస్ కి ట్రైనింగ్..?

By Xappie Desk, November 10, 2018 12:16 IST

జగన్ పై దాడి చేయకముందే శ్రీనివాస్ కి ట్రైనింగ్..?

వైసీపీ అధినేత జగన్ అక్టోబర్ 25 వ తారీఖున విశాఖపట్టణం ఎయిర్పోర్టులో విఐపి లాంజ్ లో కూర్చున్న సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో అతి దారుణంగా హత్యా యత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో తృటిలో తప్పించుకున్న జగన్ వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది నిందితుడు శ్రీనివాస్ ని గట్టిగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే జగన్ పై దాడి జరిగింది అన్న వార్త వినగానే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతో పాటు జాతీయ స్థాయిలో నేతలు కూడా షాక్ తిన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కావాలనే జగన్ చేస్తున్న పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక జగన్ పై భౌతికంగా దాడులకు తెగబడింది అని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తుంటే మరోపక్క జగన్ కావాలనే తనపై తాను హత్యా ప్రయత్నం చేయించుకుని సానుభూతి రాజకీయాలు పొందాలని దొంగ నాటకాలకు తెరలేపారని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై దాడి జరిగి ఇప్పటికి రెండు వారాలు గడుస్తున్నా నిందితుడు శ్రీనివాస్ దగ్గర నుండి సరైన సమాచారం రాబట్టలేకపోయారు సిట్ బృందం. ఈ క్రమంలో జగన్ పై దాడి గురించి కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు సంచలన కామెంట్లు చేశారు. జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి నిందితుడు శ్రీనివాస్ ఇది వరకే ఈ తరహా హత్యలు చేసేటటువంటి గ్యాంగ్ ల దగ్గర శిక్షణ తీసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే జగన్ మీద జరిగినటువంటి దాడి ఏమి చిన్నది కాదని, ఎంతో మంది కరుడుకట్టిన హంతకులు ఎన్నో హత్యలకు ఇలాంటి చిన్నపాటి ఆయుధాలు ఉపయోగించే మనిషి శరీరాలల్లో కొన్ని సున్నితమైన చోట్ల గాయపరుస్తారని,దాని వల్ల గాయం తగిలింది అని తెలిసే లోపే ప్రాణాపాయ స్థితికి ఆ మనిషి వెళ్ళిపోతాడని అభిప్రాయపడుతున్నారు. ఈ దాడిలో జగన్ కు అదృష్టం ఉండబట్టి బయటపడ్డారని అన్నారు.Top