స్కూల్ లో చదువు చెపాల్సిన టీచర్ ఫేస్ బుక్ లో మోసపోయింది..!

స్కూల్ లో చదువు చెపాల్సిన టీచర్ ఫేస్ బుక్ లో మోసపోయింది..!

ఒకపక్క టెక్నాలజీ వచ్చి మనుషుల మధ్య దూరం పెంచుకుంటే మరోపక్క కుటుంబాలను రోడ్డున పడేస్తూ భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలు చోటు చేసుకోవడానికి సోషల్ మీడియా ఎంతగానో సహకరిస్తున్న ఈ తరుణంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన టీచర్ ఓ యువకుడి చేతిలో దారుణంగా మోసపోయింది. కోయంబత్తూరుకు చెందిన మహిళ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. భర్తతో విభేదాలొచ్చి కొంత కాలంగా ఒంటరిగా నివసిస్తోంది. మదురై జిల్లాకు చెందిన రాజప్రవీణ్‌ తో ఏడాది కిందట ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ బయట కలవడం జరిగింది. ఈ నెల 7వ తేదీన రాజప్రవీణ్‌ కోయంబత్తూరుకు వచ్చి ఆమెను చిన్న పాళయంలోని హోటల్‌కు తీసుకెళ్లాడు...సదరు యువకుడు తన శరీర కోరికలు తీర్చుకోవడం కోసం మధుమేహం నివారణ కోసం ఆమె వెంటతెచ్చుకున్న మాత్రల్లో అతడు మత్తుమందు కలిపి..మత్తులో ఉన్న ఆమెతో తన శరీర కోరికలు తీర్చుకుని ఆ దృశ్యాలను వీడియో గా చిత్రీకరించారు. దీంతో స్పృహలోకి వచ్చాక ఆమెకు ఆ దృశ్యాలను చూపాడు. ఈ దృశ్యాలను చూసిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, అతడు నిరాకరించడంతో పాటు రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసి, 4 తులాల బంగారు నగలు, చెక్‌బుక్, రూ.లక్ష నగదు తీసుకుని పారిపోయాడు. దీంతో మోసపోయిన బాధితురాలు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top