ఇండియాటుడే సర్వేలో దూసుకెళ్ళిపోతున్న టిఆర్ఎస్ పార్టీ..!

By Xappie Desk, November 10, 2018 12:22 IST

ఇండియాటుడే సర్వేలో దూసుకెళ్ళిపోతున్న టిఆర్ఎస్ పార్టీ..!

2014 ఎన్నికల్లో తెలంగాణ నినాదంతో బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకుంది. ముఖ్యంగా కేసీఆర్ తనదైన శైలిలో పాలన చేస్తూ ఒక పక్క అభివృద్ధిని మరోపక్క విపక్ష పార్టీలకు చెందిన నాయకులను ఏకిపారేసిన జాతీయ స్థాయిలో కూడా తనకంటూ అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకానొక సమయంలో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసే దిశగా కూడా కెసిఆర్ పావులు కదిపారు. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సంచలన సర్వే ఇండియాటుడే సర్వేలో టిఆర్ఎస్ పార్టీ హవా మళ్లీ కొనసాగుతుందని తేలిపోయింది.
 
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెల 7 వ తారీకు జరగబోయే ఎన్నికలలో కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 46%, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)కి 25%, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్‌ కోదండరాంకు 7%, అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు.
 
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్‌ ద్వారా సంప్రదించి ఇండియా టుడే సంస్థ 'పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌' పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు తాజా సర్వే ఫలితాలను చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఎంతమంది పోగేసి కూడగట్టుకొని వచ్చిన టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరని అంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు.Top