సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న స్వామి పరిపూర్ణానంద కామెంట్లు..!

By Xappie Desk, November 10, 2018 12:24 IST

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న స్వామి పరిపూర్ణానంద కామెంట్లు..!

గతంలో శ్రీపీఠం తరపున రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రవచనాలు వల్లించిన స్వామి పరిపూర్ణానంద ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న స్వామి పరిపూర్ణానంద..ప్రచారంలో భాగంగా తన తోటి బిజెపి నాయకులతో చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రవచనాలు చెప్పే.. పరిపూర్ణానందస్వామి నిజస్వరూపం బట్టబయలైంది. 200 ఇస్తే చాలు జనాలు ఎగబడి మీటింగులకు వస్తారు.. ఓట్లు వేస్తారని బీజేపీ స్టార్‌క్యాంపెయినర్ పరిపూర్ణానంద ప్రజలను కించపరిచేలా మాట్లాడారు. 200 చొప్పున ఇస్తే చాలు 20 వేల ఓట్లు తప్పకుండా వస్తాయన్నారు. చౌటుప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షో లో ఆయన తన అనుచరుడికి ఈ విషయాలను వివరించారు. ప్రజలను అవమానపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిపూర్ణానంద వ్యాఖ్యలపై సొంతపార్టీ నేతలే తలలుపట్టుకుంటున్నారు. మరికొంత మంది నెటిజన్లు ఇటువంటి వ్యక్తులు దేశభక్తి గురించి మీడియాలో మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతూ ప్రజాస్వామ్య మైన భారతదేశంలో మనుషుల మధ్య గోడలు కట్టే ఇటువంటి వ్యక్తులు భగవంతుడు గురించి దేశం గురించి చెప్పడం మనం వినడం మన ఖర్మ అని కామెంట్లు చేస్తున్నారు.
<div>&nbsp;</div>
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop