పోలవరం మీద మోడీ కొత్త అడ్డుపుల్ల…ఇదెక్కడి అన్యాయం ?

By Xappie Desk, November 11, 2018 11:54 IST

పోలవరం మీద మోడీ కొత్త అడ్డుపుల్ల…ఇదెక్కడి అన్యాయం ?

కేంద్రం ఏపీ మీద మరి పక్షపాతంగా వ్యవహరిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అని వారు ఎంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వీరు పోలవరం ప్రాజెక్టు నిధులు ఎగ్గొట్టెలా ప్లాన్లు వేసుకుంటున్నారు. అసలు 2010-2011 న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు అంచనా వ్యయం 16,010.45 కోట్ల రూపాయలు. 2013-14 కి అది 57,940.86 కోట్లకు పెరిగింది. దీనికి కారణం యూపీఏ సర్కార్ పోతూ పోతూ చేసిన కొత్త భూసేకరణ చట్టం. ఇందువల్ల దాదాపు రూ.2934.42 కోట్ల నుంచి రూ.33225.74 కోట్లకు భూసేకరణ వ్యయం ఎగబాకింది. అయినప్పటికీ సవరించిన అంచనాల పై కొర్రీలు నిత్యకృత్యంగా మారాయి. అయినా ఈ విషయాన్ని కేంద్రం అంగీకరించకుండా లొసుగులు గా మారుస్తోంది.
 
పోలవరంపై 2007లో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుండి 2014 మార్చి 31 వరకు, ఆడిటర్ జనరల్ సమగ్ర నివేదికలను సమర్పించమని ఈ నెల 2న జరిగిన భేటీలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2013-14 పోలవరం అంచనాల సవరణకు, ఆరేళ్ల ఆడిటర్ జనరల్ నివేదికకు అసలు సంబంధం ఏమిటి అని జలవనరుల అధికారులు విస్తుపోయారు. అసలు అంచనా వ్యయం పెరగడానికి కారణం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెలించాల్సి రావడం. అయినా అధికారులు ఆ సమాచారాన్ని మొత్తం 61వేల పేజీల్లో ఇచ్చినా…అది కూడా తప్పేనన్నట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు ఫిటింగ్ ఏమింటే.. పోలవరం ప్రాజెక్టు 2010-11 అంచనా మేరకు రూ.16,010.45 కోట్లు దాదాపు ఇచ్చేశామని.. తుది అంచనాలు ఆమోదం పొందితే తప్ప కొత్తగా నిధులు మంజూరు చేయలేమని కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ చెబుతున్నారు.
 
ఇదంతా కేంద్రం కావాలనే చేస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఆరు నూరైనా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని కృతనిశ్చయంతో ఉన్నారు. ఒకసారి ఆగితే మళ్లీ కొనసాగించడం కష్టమని ఆయన ఉద్దేశం. పోలవరం గేట్ల తయారీ, బిగింపు బాధ్యతను బెకామ్‌ సంస్థకు అప్పగించారు. ఇప్పటికే ట్రాన్‌స్ట్రాయ్‌ ఆధ్వర్యంలో 48 గేట్ల తయారీ పనులను చేస్తున్న బెకామ్‌, జలవనరుల శాఖ నిర్ణయంతో మరింత వేగంగా ఈ పని చేస్తుందని భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై ఎక్కువ భారం పడనుండగా కేంద్రం మాత్రం ఇవేవీ పట్టనట్లు మొండి పట్టుదలతో కూర్చొని ఉంది.
 
Journalists, who have a passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop