నా కొడుకుని చంపాలని చూసారు , దర్యాప్తు జరగాల్సిందే విజయమ్మ ప్రెస్ మీట్

నా కొడుకుని చంపాలని చూసారు , దర్యాప్తు జరగాల్సిందే  విజయమ్మ ప్రెస్ మీట్

ప్రజలు లేని ఎయిర్పోర్ట్ ని ఎంచుకొని చంపడానికి చూశారని అయితే ప్రజల ప్రేమ, దీవెనలతోనే ఈ ప్రమాదం నుంచి జగన్‌ తప్పించుకున్నారని అన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్య , ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ తల్లి విజయమ్మ . రీసెంట్ గా ఆమె జగన్ గురించి మాట్లాడడం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.అన్ని మౌనంగా బరిస్తుంటే కుటుంబం మీద కాంగ్రెసు,టీడీపీ వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.భారతమ్మ ను కూడ ఈడీ దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అయిన సరే ఎవరికి తలవంచలేదు..
 
17 రోజులు అవుతుంది కేసు దర్యాప్తు అక్కడే ఉంది.ప్రభుత్వం ఎవరికి భద్రత ఇస్తుంది ఎయిర్పోర్ట్ లోకి కత్తి ఎలా వెళ్ళింది అనే దానిపై విచారణ చేయకుండా ఎందుకు భయపడుతున్నారు.జగన్ కేసు పై నిస్పక్షపాత విచారణ జరగాలని ఆమె చెప్పారు.17 రోజుల విరామం అనంతరం వైఎస్‌ జగన్‌ రేపటి (సోమవారం) నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించబోతున్నారు.జగన్ జనం కోసం వెళ్తున్నారు.పాదయాత్ర ను ఆశీర్వదించాలి నా కొడుకును కాపాడుకునే బాధ్యత మీదే అని అన్నారు.రాజశేఖర్ రెడ్డి వెళ్లిన బాధ నుంచి ఇంకా కొలుకోలేదు..
 
జగన్ ను మా నుంచి దూరం చేయవద్దు,నమ్మిన వాళ్లకు ప్రాణం పోయడమే జగన్ కు తెలుసని పెర్కున్నారు.ఒకపక్క ప్రతిపక్ష నేత పై దాడి జరిగితే అది అడగడం పోయి జగన్ హైదరాబాద్ రావడాన్ని కూడా వెకిలిగా మాట్లాడారని మండిపడ్డారు. మూడున్నర అంగుళాల లోతుగా భుజంపై కత్తి దిగింది.మెడ మీద తగిలితే ఏంటి పరిస్థితి విచారణ చేయకుండా డీజీపీ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది ?అని విజయమ్మ ప్రశ్నించారు.రాష్ట్ర బలగాలపై నమ్మకం లేదని కేంద్ర బలగాల రక్షణ కోరారు.
 
Journalists, who have a passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top