విపక్షాలకు దీటైన వ్యూహం వేసిన బాబు..!

విపక్షాలకు దీటైన వ్యూహం వేసిన బాబు..!

చంద్రబాబు ఎంతో నిఖార్సైన రాజకీయవేత్త అనేది వేరేగా చెప్పాల్సిన పనిలేదు. అపర చాణక్యుడు అని పేరున్న బాబు ఏ పని చేసినా దూరదృష్టితోనే చేస్తాడు. ఇటీవల కాంగ్రెస్ తో జతకట్టిన అతనిని విమర్శించిన వారందరూ ఇప్పుడు అతని వ్యూహం తెలుసుకుని నోర్లు వెళ్లబెడుతున్నారు. ముఖ్యంగా అతని కాంగ్రెస్ తో జత కట్టడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పక్కా ప్రణాళిక ప్రకారం పైచేయి సాధించే విధంగా అడుగులు వేసినట్లయింది. ఇది ఇతర రాజకీయ పార్టీల నేతల గుండెల్లో గుబులు పుట్టించే విషయం.
 
తెలంగాణలో ఎన్నికలకు పట్టుమని పాతిక రోజులు కూడా లేవు. ముందు అంతా కెసిఆర్ విజయమని అందరూ భావించారు కానీ చంద్రబాబు మహాకూటమి ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి కొంచెం తేడాగా మారింది. అప్పటికీ కెసిఆర్ దాదాపు చంద్రబాబు నే టార్గెట్ గా చేసి ప్రచారంలో కొత్త ఎత్తివేసినా…చివరికి తన ఎత్తు చిత్తవుతుందో ఏమో అని భయం పట్టుకుంది. దీంతో ఏపీలోనే ఉండి తెలంగాణలో పరిస్థితులు తిప్పేసిన చంద్రబాబును అందరూ మెచ్చుగోలుగా చూస్తున్నారు. తన వ్యూహంతో చంద్రబాబు తెలంగాణలో ఏ మేరకు ఓటు బ్యాంకును ప్రభావితం చేశారు కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
 
ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. అధికారం కోసం ఇద్ద‌రు నాయ‌కులు ప్ర‌య‌త్నాలు తీవ్రం చేశారు. జ‌గ‌న్ ఒక‌ప‌క్క‌, ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ మ‌రోప‌క్క‌, సీఎం సీటు కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దశలో చంద్రబాబు ఏపీలోని కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా చేజిక్కించుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనా తనకెలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. ఎన్నికలు మరో ఆరు నెలలు ఉండడంతో బాబు ఇప్పటి నుండే సర్వేలను దృష్టిలో పెట్టుకొని తన అడుగులు వేసేందుకు ఎంతో వీలుగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో అంతుచిక్కని వ్యూహాలతో బాబు కేంద్రంలో కూడా ఒక వెలుగు వెలుగుతున్నాడు. దీంతో చివరికి బాబు మీద ఎన్ని విమర్శలు చేసినా…అవి గాలికి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిపోయింది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop