అరస్ట్ అయిన మూడు గంటల్లో కీలక సమాచారం ఇచ్చిన గాలి !

By Xappie Desk, November 12, 2018 10:36 IST

అరస్ట్ అయిన మూడు గంటల్లో కీలక సమాచారం ఇచ్చిన గాలి !

కర్ణాటక బళ్లారి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గత కొంత కాలం నుండి బెంగళూరు విడిచి హైదరాబాదులో తలదాచుకున్నారని ఇలా అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపద్యం లో గాలి జనార్ధన్ అజ్ఞాతంలో నుండి బయటకు వచ్చి తానే ఎక్కడికి పారిపోలేదని గత కొన్నాళ్ల నుండి బెంగళూరులోనే ఉంటున్నానని గాలి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకి విషయం ఏమిటంటే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఆంబిటెండ్ కంపెనీ ప్రజల నుండి కొన్ని కోట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
 
ఈ క్రమంలోనే సదరు కంపెనీ పై ఈడీ కూడా కేసు రిజిస్టర్ చేసింది. తర్వాత ఇదే కేసులో ఆ కంపెనీ ఓనర్ ఫరీద్ ను అరెస్టు చేసింది. అతన్ని బయటపడేసేందుకు గాలి జనార్ధన్ రెడ్డి ఈడీలోని కొంతమంది అధికారులతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు బ్రిజేష్ అనే ఈడీ అధికారిని అదుపులోకి తీసుకుంది. గాలి జనార్ధన్ రెడ్డి కోసం వేట సాగించగా ఆయన ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు...ఇదే క్రమంలో బెయిల్ కోసం ప్రయత్నించారు..అయితే బెయిల్ దొరకకపోవడంతో గాలి జనార్ధన్ రెడ్డి పోలీసులకు లొంగి పోయి..క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం లో పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చారు...తాను ఎక్కడికి పారిపోలేదని సమాధానం ఇచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి ని.. పోలీసుల కార్యాలయంలో విచారించిన తర్వాత సదరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో గాలి జనార్ధన్ రెడ్డి విచారణలో పోలీసులకు అత్యంత కీలకమైన సమాచారం ఇచ్చినట్లు కర్ణాటక రాష్ట్రంలో వార్తలు వినబడుతున్నాయి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top