కాంగ్రెస్ కి 'ఆ కులం' ఓటు బ్యాంకు దూరం చేసిన బాబు !

కాంగ్రెస్ కి 'ఆ కులం' ఓటు బ్యాంకు దూరం చేసిన బాబు !

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గాని చంద్రబాబు మాట వినాల్సి వస్తుందని..ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పూర్తిగా తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఆది నుంచి ఉండటంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ని గద్దె దింపడం కోసం సదరు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ కి దూరం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ తెలంగాణ నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో మహా కూటమి సీట్ల విషయంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చంద్రబాబు ఎక్కువ కలుగజేసుకుని రెడ్డి సామాజిక వర్గానికి సరైన స్థానాలు ఇవ్వటం లేదని టాక్ వినపడుతుంది.
 
దీంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఆది నుండి నమ్ముకుంటున్న చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు..కాంగ్రెస్ పార్టీ కంటే టిఆర్ఎస్ పార్టీ బెటర్ అని అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. మరో పక్క టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు కార్పొరేషన్ వంటి వాటిలో పలు హామీలు ఇవ్వడంతో పాటు...ఇటీవల వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో కెసిఆర్ బాధ్యతగా వ్యవహరిస్తూ రాజకీయ నేతగా హుందాగా వ్యవహరించడం తో..కాంగ్రెస్ కంటే టీఆర్ ఎస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని సదరు రెడ్డి సామాజిక వర్గం భావిస్తూ రానున్న రోజుల్లో..కాంగ్రెస్ పార్టీ కంటే టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని చాలామంది రెడ్డి సామాజిక వర్గం లో ఉన్న ప్రముఖులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
 
Journalists, who have a part-time passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop